EXPLOSION AT POLICE STATION : ప్రజలు అదమరిచి నిద్రిస్తున్న సమయంలో హఠాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వేకువజామున భారీ పేలుడు జరగ్గా... కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. గాజు పెంకులు చెల్లా చెదురయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డితో సహా మరో కానిస్టేబుల్ ఉన్నారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు.. ఏఎస్ఐకి స్వల్పగాయాలు
EXPLOSION AT POLICE STATION : తెల్లవారుజామున భారీ శబ్దంతో చిత్తూరు జిల్లా హడలిపోయింది. గంగాధర నెల్లూరు పోలీస్స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తి పోయారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 వ సంవత్సరంలో పోలీసులు ఓ కేసులో పట్టుబడిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో గల మర్రిచెట్టు కింద ఉంచారు. కాలక్రమంలో చెత్తా చెదారం, సిమెంటు కాంక్రీట్ వ్యర్ధాలు చేరి నల్లమందు మరుగునపడిపోయింది. ఉదయం అదే ప్రదేశంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బెంబేలెత్తి పోయారు. పోలీస్ స్టేషన్ నుంచి ASIతో సహా మరో కానిస్టేబుల్ క్షేమంగా బయటకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు తూర్పు డీఎస్పీ సుధాకర్ రెడ్డి స్టేషన్‌ను పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి...వివరాలను సేకరించారు.
ఇవీ చదవండి: