ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని.. మహిళపై కత్తితో దాడి - knife attack on women

Attack on Woman: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో.. మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే.. మహిళపై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు.. వైరల్​గా మారాయి.

ATTACK
ATTACK

By

Published : May 27, 2022, 4:47 PM IST

వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి..

హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే.. బిజీగా ఉన్న రోడ్డులో.. అందరూ చూస్తుండగానే.. మహిళపై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో.. మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

దాడికి తెగబడ్డ నిందితుడు షేక్ ​నసీరుద్దీన్​(32)గా పోలీసులు గుర్తించారు. బాబానగర్​లోని ప్రభుత్వ పాఠశాల పక్కనే నసీరుద్దీన్ నివాసముంటున్నాడు. అదే కాలనీలో సైదానూర్​ బాను(40) ఉంటోంది. సైదానూర్​ బానుకు ముగ్గురు పిల్లలున్నారు. కాగా.. ఆమె భర్త ఇంతియాజ్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఒకే కాలనీలో ఉండటం వల్ల నసీరుద్దీన్​తో సైదానూర్ బానుకు పరిచయం ఏర్పడింది.

పరిచయాన్నే అదునుగా తీసుకుని నసీరుద్దీన్​.. గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కోసం వేదిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. ఆ కోపంతో.. సైదానూర్​ బానుపై నసీరుద్దీన్ ఇవాళ కత్తితో దాడి చేసి.. పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు... బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం గాలిస్తున్నారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details