జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ మృతి కేసులో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్(Jr. Artist suicide anuradha case) అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. కిరణ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు.
అనురాధ.. కిరణ్ అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు తెలియకుండా వేరే యువతి(Jr. Artist suicide case) తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడని.. తనను మోసం చేశాడనే కోపంతో కిరణ్‌తో ఆమె గొడవపడినట్లు పోలీసులు చెప్పారు. అయినా అతడు పట్టించుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే అనురాధ-కిరణ్‌లు గత మూడు నెలలుగా ఫిలింనగర్‌లో నివసిస్తున్నారు. ఆమె బలవన్మరణానికి పాల్పడిన సమయంలో కిరణ్ ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులు(anuradha case updates) ఆరా తీస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్.. కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(Jr. Artist suicide case) (22) మూడు నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు.
బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ(Jr. Artist suicide case) మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు తెలియకుండా కిరణ్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకనే తన సోదరి తనువు చాలించిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :
Warangal rape case: అత్యాచారం కేసు.. తెరాస కార్పొరేటర్ భర్త అరెస్టు