ENGINEERING STUDENT SUICIDE: ఎగ్ దోశకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య - ap 2021 crime news
14:30 September 22
తలారివారిపల్లెలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
చిత్తూరు జిల్లా తలారివారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఎగ్ దోశ తినేందుకు కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో సాయికిరణ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య(ENGINEERING STUDENT SUICIDE) చేసుకున్నాడు. పాకాల మండలం తలారివారిపల్లెకు చెందిన సాయికిరణ్ ప్రస్తుతం ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి రమణయ్య గతంలోనే మృతి చెందారు. తల్లే ఇన్నాళ్లు కష్టపడి పెంచింది. నిన్న ఉదయం సాయికిరణ్కు ఎగ్ దోశ(SUICIDE FOR EGG DOSA) తినాలనిపించి తల్లిని డబ్బులు అడిగాడు.
ఇంట్లో చేసిన భోజనమే తినమని.. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దని తల్లి చెప్పింది. కుటుంబ సభ్యులు తనకు నచ్చింది కూడా తినేందుకు డబ్బులివ్వడం లేదని మనస్తాపం చెందాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సాయికిరణ్.. ఇరంగారిపల్లె సమీపంలోని గుర్రప్పకుటంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంత చిన్న విషయానికే చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సాయికిరణ్ తల్లి గుండలవిసేలా రోదిస్తోంది.