Elephant dies due to electric shock: చిత్తూరు జిల్లా కొల్లదమడుగులో ఏనుగు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. అటవీ ప్రాంతం పొలంలోని బోరు మోటర్‌ను నోటితో పెరకడంతో విద్యుత్ షాక్ తగిలి ఏనుగు చనిపోయింది. ఏనుగు చనిపోయినట్లు గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన ఆడ ఏనుగు వయస్సు 15 సంవత్సరాలు ఉంటుందని అధికారులు తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన.. పలమనేరు నుంచి కుప్పం పరిసరాల్లో.. కౌండిన్య అరణ్య ప్రాంతం ఏనుగుల జీవనోపాధికి అనుకూలమైన ప్రదేశం కావడంతో.. అధిక సంఖ్యలో ఏనుగులు సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడు అధిక సంఖ్యలో ఏనుగులు దగ్గరలో ఉన్న ఊర్లలోకి గుంపులు గుంపులుగా వస్తుంటాయి. రైతులు పంట పొలాలకు అమర్చిన ట్రాన్స్ఫార్మర్లను రాత్రివేళ్లలో ఏనుగులు ఢీకొని.. ఇప్పటివరకు సుమారు ఐదు ఏనుగులు మృతి చెందాయని స్థానికులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో ఏనుగు మృతి
Elephant dies due to electric shock: జంతువులకు అత్యంత రక్షణ ప్రాంతమైన అడవీ ప్రాంతాలలో కూడా అవి ప్రశాంతంగా జీవించలేకపోతున్నాయి. అటవీ ప్రాంతాలలో కూడా విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు బిగిస్తున్నారు. వాటికి సరైన రక్షణ లేకపోవడంతో, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన ఘటన జంతు ప్రేమికుల మనసులను కలచివేస్తోంది.
ఏనుగు మృతి
మరోవైపు ఏనుగుల ఎదురుదాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అటు పంటలను నష్టపోతున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు ప్రమాదాన్ని విన్నవించుకున్నా.. తూతూ మంత్రంలా పంట నష్ట పరిహారము చెల్లిస్తున్నారు.. కానీ సమస్యలను పరిష్కరించటం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి: