ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పొలాల్లో దొంగలు పడ్డారు..! ట్రాన్శ్​ఫార్మర్ల కీలక పరికరాలు ఎత్తుకెళ్లిన దుండగులు - నేర సమాచరం

Electricity Transformer Theft: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరావు పేటలో రాత్రి గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలో ఉన్న పరికరాలను ఎత్తుకెళ్లారు. రైతులు పొద్దున్నే పొలం వెళ్లి చూస్తే.. ట్రాన్స్‌ఫార్మర్లన్నీ చెల్లాచెదరుగా పడి ఉండటంతో స్థానిక లైన్మన్​కు ఫిర్యాదు చేశారు.

Transformer Theft
ట్రాన్స్‌ఫార్మర్లు

By

Published : Feb 6, 2023, 10:23 PM IST

Electricity Transformer Theft in AP: చోరీలకు కాదేది అనర్హం అనుకున్నారేమో ఆదొంగలు. అన్నదాతలు పోలానికి నీరు పెట్టాలంటే అవసరమైనవి ట్రాన్స్​ఫార్మర్స్. అలాంటి ట్రాన్స్​ఫర్మర్లపై ఆ దొంగల కన్ను పడింది.. ఇంకేముంది అదును కోసం ఎదురు చూశారు. రాత్రి పోలాల వద్ద రైతులు లేని సమయంలో నాలుగు ట్రాన్స్​ఫార్మర్లను కిందికి దించి.. అందులోని వస్తువులను దొంగిలించారు. రైతులు ఉదయం పోలానికి వచ్చి చూడగా... ఆయా ట్రాన్స్​ఫార్మర్లలలోని వస్తువులు దొంగిలించారని అన్నదాతలు లబో దిబో మన్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరావు పేటలో రాత్రి గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలో ఉన్న పరికరాలను ఎత్తుకెళ్లారు. రైతులు పొద్దున్నే పొలం వెళ్లి చూస్తే.. ట్రాన్స్‌ఫార్మర్లన్నీ చెల్లాచెదరుగా పడి ఉండటంతో స్థానిక లైన్మన్​కు ఫిర్యాదు చేశారు. దుండగులు చేసిన పనికి చేతికొచ్చిన పంట నీళ్లు లేక నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దుండగులను పట్టుకొని శిక్షించాలన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి తమని ఆదుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు.

ట్రాన్స్‌పార్మర్లలోని పరికరాలను ఎత్తికెళ్లిన దుండగులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details