తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- శ్రీశైలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా... హైదరాబాద్‌కు తరలించారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు... హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు... ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ వద్ద అతివేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జవగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే కారులోని ముగ్గురు మృతి చెందగా.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే కారులోని నలుగురు మృతి చెందారు.
telangana: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి - road accident at nagar kurnool news
22:12 July 23
19:30 July 23
Eight people were killed in a road accident
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. సాధ్యమైనంత త్వరగా కార్లలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మృతదేహాల గుర్తింపు...
హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై చెన్నారం గేటు వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండు కార్లు అతి వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన కార్లలో ఒకటి హైదరాబాద్‌కు చెందిన వారిదిగా గుర్తించారు. మృతులు జీడిమెట్లకు చెందిన వంశీ, నిజాంపేటకు చెందిన వెంకట్, పటాన్‌చెరుకు చెందిన నరేశ్, ఆనంద్‌బాగ్‌కు చెందిన శివకుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలు అంచనా వేస్తున్నారు. మృతదేహాల వద్ద లభ్యమైన గుర్తింపు కార్డులు, కారు నంబర్ల ఆధారంగా మృతుల బంధువులకు పోలీసులు సమాచారమందిస్తున్నారు. ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం
నాగర్‌కర్నూల్ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.