ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తెరాస నేత ఈటల​కు అన్యాయం జరిగిందంటూ.. అభిమాని ఆత్మహత్యాయత్నం! - telangana varthalu

తెలంగాణలో అధికార పార్టీ అయిన తెరాస సీనియర్ నేత ఈటలకు.. తీవ్ర అన్యాయం జరగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా మందమర్రిలో కలకలం సృష్టించింది. కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ అభిమాని ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. స్థానికులు అడ్డుకోగా.. లారీ కిందకు చేరి నిరసన తెలిపాడు.

eetela rajendar fan suicide attempt
తెరాస నేత ఈటల​కు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం

By

Published : May 2, 2021, 9:35 PM IST

తెరాస నేత ఈటల​కు అన్యాయం జరిగిందంటూ అభిమాని ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రిలో... తెరాస నేత ఈటల రాజేందర్ అభిమాని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో.. ఈటలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ... మందమర్రి అంగడి బజార్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ ముదిరాజ్​ ఈ పని చేశాడు. వెంకటేశ్​కు మొదటి నుంచి ఈటల రాజేందర్ అంటే ఎనలేని అభిమానం. ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించేవాడు.

హైదరాబాద్​లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసే వెంకటేశ్ రెండు రోజుల క్రితం మందమర్రికి వచ్చాడు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈటల రాజేందర్​కు మద్దతుగా ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం అటుగా వెళ్తున్న లారీ కిందకు చేరి తన నిరసన తెలిపాడు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని వెంకటేష్​ను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details