ED RAIDS IN DELHI LIQUOR SCAM : దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లోని 35 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లో నాలుగుచోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లితో పాటు మరో రెండుచోట్ల సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దిల్లీ మద్యం కుంభకోణం.. వ్యాపారి ముత్తా గోపాలకృష్ణ ఇల్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు - ED RAIDS IN DELHI LIQUOR SCAM
ED RAIDS : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, పంజాబ్ సహా హైదరాబాద్‌లోని 35 ప్రదేశాల్లో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. అటు ప్రముఖ వ్యాపారి ముత్తా గోపాలకృష్ణ ఇల్లు, కార్యాలయంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ED RAIDS IN DELHI LIQUOR SCAM
అటు ప్రముఖ వ్యాపారి ముత్తా గోపాలకృష్ణ ఇల్లు, కార్యాలయంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఓ ఛానల్లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ ఛానల్ ముత్తా గోపాలకృష్ణకు చెందిన గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 7, 2022, 12:48 PM IST