తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు (Telugu Academy Case) కేసు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా... తాజాగా తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో.. ఈడీ రంగలోకి దిగింది. రూ.కోట్ల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
Telugu academy scam: తెలుగు అకాడమీ కుంభకోణం కేసు... రంగంలోకి దిగిన ఈడీ - తెలుగు అకాడమీ కుంభకోణం వార్తలు
09:03 October 08
మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేయనున్న ఈడీ అధికారులు
జనవరి నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయి. ఎఫ్‌డీలను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్ సొసైటీకి మళ్లించారు. కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లను మళ్లించారు. అకాడమీకి చెందిన రూ.64.5కోట్లను కొల్లగొట్టిన నిందితులు.... వాటితో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. సాయికుమార్ ఔటర్ రింగ్‌రోడ్ పక్కన 35 ఎకరాలు కొనుగోలు చేశాడని... బ్యాంకు మేనేజర్లు మస్తాన్‌వలీ, సాధన ఫ్లాట్లు కొనుగోలు చేశారని వెల్లడించారు. వెంకటేశ్వర్‌రెడ్డి సత్తుపల్లిలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులు గుర్తించేందుకు ఈడీ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేస్తామని ఈడీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి
TELUGU AKADEMI FD SCAM: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ఎవరి వాటా ఎంతంటే..?
Telugu academy scam : 'ఫిబ్రవరిలోనే ఎఫ్డీలు కాజేసేందుకు యత్నం!'