Chikoti Praveen: విదేశీ క్యాసీనోల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలపై ఈడీ విచారణ కొనసాగుతోంది. గత నెలాఖరున ప్రవీణ్ తోపాటు మరో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు.. పలు సాంకేతిక ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నాయి. సెల్‌ఫోన్‌లతోపాటు ల్యాప్‌టాప్‌లను జప్తు చేసి వాటిని విశ్లేషించడంలో నిమగ్నమయ్యాయి. సంభాషణల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వాట్సప్ చాటింగ్‌లు ఉంటాయని ముందు నుంచే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో సాగించిన వాట్సప్ సంభాషణల్ని ఈడీ గుర్తించింది. వీటి సారాంశంపై లోతుగా విశ్లేషిస్తోంది. వీరేమైనా ప్రవీణ్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించారా? అదే జరిగితే ఆ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందా? అని తేల్చే పనిలో నిమగ్నమైంది.
Chikoti Praveen: చీకోటి ప్రవీణ్ కేసు.. సాంకేతిక ఆధారాలు స్వాధీనం - ఈడీ
Chikoti Praveen: విదేశీ క్యాసీనో, హవాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ.. పలువురు రాజకీయ నేతలతో చీకోటి ప్రవీణ్ జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతోంది. నేపాల్, శ్రీలంక, థాయ్‌ల్యాండ్, మలేషియా తదితర దేశాల్లో క్యాసీనోల నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్ తో.. పలువురు ఎమ్మెల్యేల వాట్సప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రవీణ్, మాధవరెడ్డి సెల్ ఫోన్లను ఫొరెన్సిక్ ల్యాబ్ లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
Chikoti Praveen
సోదాల సమయంలో ప్రవీణ్, మాధవరెడ్డి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ ఆధికారులు... ఆర్ధిక లావాదేవీలు, వాట్సాప్ చాటింగ్‌ను రీట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. ఫొరెన్సిక్ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా... తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఆది కొలిక్కి వస్తే మరింత కీలక సమాచారం బహిర్గతమయ్యే అవకాశముంది. అప్పుడే మనీలాండరింగ్ అంశంపై స్పష్టత వస్తుంది.
ఇవీ చదవండి: