అనంతపురం ఆస్పత్రిలో మరో అర్జున్ రెడ్డి... తాగొచ్చి విధులు - ap latest news
11:19 September 12
ఉద్యోగి రాజును విధుల నుంచి తొలగించిన సూపరింటెండెంట్ జగన్నాథ్
అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో మద్యం తాగొచ్చి ఓ ఉద్యోగి హల్చల్ చేశాడు. ఫార్మసీ విభాగంలో పని చేస్తున్న రాజు.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు ఇస్తుంటాడు. ఈ రోజు ఉదయమే పూటుగా తాగొచ్చి అందరికీ ఒకే రకం మందులు ఇచ్చాడు. మద్యం మత్తులోనే రాజు ఇలా చేస్తున్నాడని గుర్తించిన రోగుల బంధువులు ఇదేంటని ప్రశ్నించారు. ఆస్పత్రికి తాగి ఎలా వస్తావంటూ నిలదీశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజు.. రోగులపై ఇష్టానుసారంగా మాట్లాడాడు.
రోగులు ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జగన్నాథ్.. ఉద్యోగి రాజును విధుల నుంచి తొలగించారు.
ఇదీ చూడండి:ఈ నెల 14 నుంచి 'రైతు కోసం తెలుగుదేశం'
TAGGED:
ఏపీ తాజా వార్తలు