ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ 2 వారాలకు వాయిదా - దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్ తాజా సమాచారం

Disha Encounter Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు​పై.. తెలంగాణ హైకోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. పూర్తిస్థాయి విచారణ జరపాలని హైకోర్టుకు ఇటీవల సుప్రీంకోర్టు బదిలీచేసింది. అమికస్ క్యూరీ డి.ప్రకాశ్ రెడ్డి కేసు నేపథ్యాన్ని వివరించారు. కమిషన్ నివేదికను సమర్పించాలని అమికస్ క్యూరీకి ఆదేశించింది.

hc
hc

By

Published : Jun 21, 2022, 12:07 PM IST

Disha Encounter Case: సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై.. తెలంగాణ హైకోర్టులో మళ్లీ విచారణ మొదలైంది. పూర్తిస్థాయి విచారణ జరపాలని ఈ కేసును హైకోర్టుకు ఇటీవల సుప్రీంకోర్టు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కేసులతోపాటు.. గతంలో హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ కలిపి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం.. విచారణ చేపట్టింది. అమికస్ క్యూరీ డి.ప్రకాష్ రెడ్డి కేసు నేపథ్యాన్ని వివరించారు. షాద్ నగర్‌లోని చటాన్ పల్లి వద్ద 2019 డిసెంబరు 6న జరిగిన దిశ అత్యాచారం, హత్య అనంతరం.. నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిషన్.. ఇటీవలే నివేదిక సమర్పించిందని తెలిపారు. కమిషన్ నివేదికను సమర్పించాలని అమికస్ క్యూరీని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే..

2019 నవంబర్​ 27న రాత్రి హైదరాబాద్​ శివారులో యువవైద్యురాలిపై నలుగురు యువకుల హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనతో దిగ్భ్రాంతి చెందిన యావత్​ ప్రజానీకం.. నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటూ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. నిందితులు మహ్మద్​ ఆరిఫ్​ పాషా, జొల్లు శివ, నవీన్​, చెన్నకేశవులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. డిసెంబర్​ 6 తెల్లవారుజామున ఘటనాస్థలంలో సీన్​ రీకన్​స్ట్రక్షన్ చేస్తుండగా.. ఎదురుకాల్పుల్లో నలుగురూ నిందితులూ మరణించారు. ఘటనాస్థలాన్ని అప్పడు సైబరాబాద్​ కమీషనర్​గా ఉన్న సీపీ సజ్జనార్​ పరిశీలించారు.

సీన్​ రీ కన్​స్ట్రక్షన్​ చేస్తున్న సమయంలో నిందితులు ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించడంతోనే ఎదురుకాల్పులు జరిపినట్లు సజ్జనార్​ వెల్లడించారు. ఎన్​కౌంటర్​పై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్​) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నిందితుల ఎన్​కౌంటర్​ బూటకమంటూ మానవహక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2019 డిసెంబర్‌ 12న అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్​ వీ.ఎస్​. సిర్పూర్కర్‌ ఆధ్యర్యంలో కమిషన్‌ను నియమించింది. ఆరు నెలల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details