ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Job Cheating : "ఏం నాయనా.. 3 లక్షల జీతం ఇస్తాం.. ఉద్యోగం చేస్తావా?"

Digital India private limited : నిజంగా.. జులాయి సినిమాలో చెప్పినట్టుగా.. చాలామందికి లాజిక్కులు అవసరం లేదు. మ్యాజిక్కులు మాత్రమే కావాలి. కష్టపడకుండా డబ్బులు వచ్చిపడతాయంటే చాలు.. కనీస ఆలోచనకూడా చేయరు. బొక్కబోర్లా పడ్డ తర్వాత.. తీరిగ్గా బాధపడతారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటారు. అలాంటి ఓ సంఘటనే మళ్లీ రిపీట్ అయ్యింది. ఇంట్లో కూర్చోబెట్టి (వర్క్ ఫ్రమ్ హోం) నెలకు 3 లక్షలు జీతం ఇస్తామనే సరికి ఎగబడ్డారు. లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు..!

Job Cheating
Job Cheating

By

Published : Jul 6, 2022, 7:43 PM IST

Job Cheating

Digital India private limited company cheated the unemployed: "పుస్తకాలను స్కాన్ చేసి.. పీడీఎఫ్ రూపంలోకి మార్చి పంపించాలి.." ఇంట్లో కూర్చొని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాల్సిన పని ఇది. దీనికి వేతనంగా ఎంత వరకు ఇస్తారు? 20 వేలు ఇస్తే.. చాలా ఎక్కువ. 30 వేలు ఇస్తారంటే కష్టమైనా నమ్మొచ్చు. కానీ.. 3 లక్షల వరకూ ఇస్తారంటే మీరు నమ్ముతారా? కనీసం.. డౌట్ రాదా? కానీ.. ఇక్కడ కొందరు నమ్మేశారు. సరే నమ్మారు.. ఉద్యోగానికి సిద్ధమయ్యారు. కానీ.. ఆ ఉద్యోగం ఇచ్చేవాడు.. ఏదో పేరు చెప్పి ముందుగా లక్షలాది రూపాయలు అడిగితే.. అప్పుడైనా అనుమానం రావాలిగా? అడిగినంతా ఇచ్చేశారు! ఇప్పుడు నెత్తీనోరు బాదుకుంటున్నారు!

ఈ మోసానికి పాల్పడిన సంస్థ పేరు "డిజినల్ ఇండియా" ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇంటిదగ్గరే ఉంటూ యూకే నవలలను స్కాన్‌ చేసి ఇస్తే చాలు.. రూ.లక్షలు సంపాదించొచ్చని ఆశ చూపింది. ఇంకేముంది? జనాలు తెగ సంబరపడిపోయారు. ఉద్యోగంలో చేరతామంటూ వారిని సంప్రదించారు. ఉద్యోగం తప్పక ఇస్తామని చెప్పిన కంపెనీ.. ఓ కండీషన్ వారి ముందు ఉంచింది.

సెక్యూరిటీ డిపాజిట్‌ కింద ఐదున్నర లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పింది. మళ్లీ ఆ డబ్బును 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తామంటూ చెప్పింది. దూకుడు సినిమాలో 2 కోట్ల ప్రైజ్ మనీ గురించి లెక్కలు వేసుకున్న బ్రహ్మానంద మాదిరిగా.. మనసులో లెక్కలు వేసుకొని కంపెనీ అడిగినంత డబ్బు కట్టేశారు. నెలకు మూడు లక్షలపైనే సంపాదించుకోవచ్చని సంబరపడ్డారు.

నవలలను స్కాన్ చేసి పీడీఎఫ్‌గా మార్చి పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసి ఇవ్వడమే వీరి డ్యూటీ. ఈ ఉద్యోగానికి లక్షలకు లక్షలు వస్తాయని నమ్మినవాళ్లు ఏకంగా 625 మంది! వీరంతా.. 11నెలల క్రితమే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. పేజీకి 5 రూపాయల చొప్పున రెండుమూడు నెలలు చెల్లింపులు బాగానే చేశారు. ఇంకేముంది..? వీరి ఉద్యోగం గురించి మరికొంత మందికి తెలిసింది. దీంతో.. వారు కూడా వలలో పడిపోయారు. లక్షలు చెల్లించుకున్నారు. ఇలా.. భారీగా డిపాజిట్లు వసూలయ్యాక దుకాణం ఎత్తేసింది సంస్థ! ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు.. డిజినల్‌ ఇండియా కంపెనీ ఎండీ అమిత్‌శర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమిత్ శర్మ డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని అమీర్‌ పేట్‌లో పెట్టారు. ఒక్క పేజీని స్కాన్ చేసి ఇస్తే.. 5 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈజీ వర్క్.. హై సాలరీ అనగానే చాలా మంది డిపాజిట్ చేశారు. అందరికీ పెమేంట్స్ ఇచ్చేది ఉండగా.. నెక్ట్స్ డే నుంచి పరారీ అయ్యాడు. శనివారం వరకు కాంటక్ట్‌లో ఉన్నారు. సోమవారం కచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పారు. మా ఫ్రెండ్స్‌కు పెమేంట్స్ వచ్చాయని మేం జాయిన్ అయ్యాం.. కానీ ఇప్పుడు నిలువునా ముంచి వెళ్లిపోయారు. -బాధితులు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details