DGP ON LOAN APPS : అనధికార లోన్ యాప్స్‌కు సహకరించే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 173యాప్‌లను బ్లాక్ చేశామని ఆయన తెలిపారు. లోన్ యాప్స్‌పై రాష్ట్రంలో 75 కేసులు నమోదవ్వగా.. 71మందిని అరెస్టు చేశామన్నారు. లోన్ యాప్స్‌కు చెందిన 10కోట్ల 50లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు. లోన్‌యాప్స్ నుంచి డబ్బులు కట్టాలని బెదిరింపులు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లోన్ యాప్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
లోన్ యాప్‌ల్లో అధికంగా చైనాకు చెందినవే ఉన్నట్లు గుర్తించామన్నారు. కీలక నిందితులు విదేశాల్లో ఉంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. డబ్బును ప్రజలకు ఎరగా వేసి వేధిస్తూ.. అధికంగా నగదు వసూలు చేస్తున్నారన్నారు. డబ్బు చెల్లించటం ఆలస్యమైతే మొదట వేధింపులు.. తర్వాత అసభ్య పదజాలంతో స్నేహితులకు మెస్సేజ్‌లు పంపుతున్నారని తెలిపారు. కొందరి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపుతున్నట్లు కేసుల విచారణలో వెల్లడైందని డీజీపీ తెలిపారు.