ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Saidabad Rape Case: సైదాబాద్ హత్యాచారం కేసును నేరుగా పర్యవేక్షిస్తున్న డీజీపీ

బాలికపై అత్యాచారం, హత్య కేసు(saidabad rape and murder case) నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును డీజీపీ(dgp mahender reddy) నేరుగా పరిశీలిస్తున్నారు. డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Saidabad Rape Case
Saidabad Rape Case

By

Published : Sep 15, 2021, 10:16 AM IST

సైదాబాద్ హత్యాచారం(saidabad rape and murder case) కేసును డీజీపీ మహేందర్‌రెడ్డి(dgp mahender reddy) నేరుగా పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు రాజు గాలింపును డీజీపీ స్వయంగా పరిశీలిస్తున్నారు. డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు. రాజు గురించి సమాచారమిస్తే రూ.10లక్షల రివార్డు(rs10 lakhs reward) అందజేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. నగరంలోని కల్లు, మద్యం దుకాణాలు, లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో రాజు తలదాచుకున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అతి త్వరలో రాజును పట్టుకోవాలని సంకల్పించారు. మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకోగా... వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడు రాజు గత కొన్ని నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు.

అదే ఆటంకం..

నిందితుడు రాజు చరవాణి ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రాజు సెల్​ఫోన్ వినియోగిస్తూ.. ఉంటే సాంకేతికత ఆధారంగా పోలీసులు ఆచూకీని వెంటనే గుర్తించేవారు. ఘటన అనంతరం పని చేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లిన రాజు.. గతంలో పని చేసినందుకు రావాల్సిన రూ.1800 తీసుకుని వెళ్లిపోయాడు. ఊరికి వెళుతున్నానని కాంట్రాక్టర్​కి చెప్పి వెళ్లాడు. తన వద్ద ఉన్న ఫోన్​ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నగరంలో జల్లెడ పడుతున్న పోలీసులు

ట్యాంక్ బండ్ సహా ప్రతి పార్కును గాలిస్తున్న బృందాలు... రైల్వేస్టేషన్, బస్​స్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్​లలో జల్లెడపడుతున్నారు. నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. సైదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లేబర్ అడ్డాను కూడా ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాజు గంజాయితో పాటు మద్యానికి బానిస అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పోలీసులు సైదాబాద్, దిల్​సుఖ్​​నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలతో పాటు రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకండ్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు.

అదుపులో రాజు స్నేహితుడు

ఇప్పటికే నిందితుడు రాజు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు... అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గాలిస్తున్నారు. రాజు చేసిన ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసులు ఎదుట రాజు స్నేహితుడు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం వీరిద్దరు తిరిగిన ప్రదేశాలలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న వార్తలను మాత్రం పోలీసు అధికారులు ఖండిస్తున్నారు.

ఉన్నతాధికారుల సమీక్ష..

చిన్నారి హత్యాచారం కేసులో పోలీస్​ ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. అదనపు డీజీ శిఖాగోయల్, సంయుక్త సీపీ రమేశ్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తితో సీపీ అంజనీ కుమార్ సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లభించాయి..? కేసు ఎంత పురోగతి సాధించింది..? అన్న అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు.

ఇవీ చదవండి:మత్తులో చిన్నారులను చిదిమేస్తున్న ఉన్మాదులు.. తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు

ABOUT THE AUTHOR

...view details