Decomposed deadbody: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామ శివారు ప్రాంతంలోని ఓ గ్రానైట్ క్వారీ గుంతలో కుళ్లిన స్థితిలో ఉన్న యువకుని మృతదేహం కలకలం రేపింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు క్వారీ గుంతలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీశారు.
క్వారీ గుంతలో కుళ్లిన వ్యక్తి మృతదేహం.. హత్యా.. ఆత్మహత్యా? - ఏపీ తాజా వార్తలు
Deadbody found: ప్రకాశం జిల్లా శంకవరంలోని ఓ గ్రానైట్ క్వారీ గుంతలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతుని వద్ద లభించిన ఆధారాల ప్రకారం గ్రామానికి చెందిన ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు.
dead body
మృతుని వద్ద ఉన్న ఆధారాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ప్రకాష్ (25) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: