విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో నాలుగు రోజుల క్రితం ఇద్దరు యువకులు నదిలో పడి గల్లంతయ్యారు. కొత్తవలస ఆనకట్ట పైనుంచి ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా.. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారు. వీరిలో రమేష్ అనే యువకుడు కొంత దూరం వెళ్ళాక రాళ్ల మధ్య ఇరుక్కోవడంతో.. స్థానికులు రక్షించారు.
నాలుగు రోజుల క్రితం నదిలో గల్లంతైన.. యువకుడి మృతదేహం లభ్యం - ఏపీ 2021 వార్తలు
నాలుగు రోజుల క్రితం విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో నదిలోపడి గల్లంతైన యువకుడి మృతదేహం.. ఈరోజు లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
అయితే.. మరో యువకుడు విజయ్ మాత్రం ఆరోజు గల్లంతయ్యాడు. నాలుగు రోజులుగా ఆచూకీ లభించలేదు. చాలాదూరం కొట్టుకుపోయిన మృతదేహం.. ఈ రోజు లభ్యమైంది. మృతుడిది ఒడిశా రాష్ట్రం. అతడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం