ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

తుక్కుగూడలో డీసీఎం వ్యాన్ బీభత్సం.. 4 వాహనాలు ధ్వంసం - telangana crime news

Van vandalized: డీసీఎం డ్రైవర్ అతివేగం తుక్కుగూడలో ప్రమాదానికి కారణమైంది. అదుపుతప్పి 2 వాహనాలను ఢీకొని బీభత్సం సృష్టించింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. నలుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం 4 వాహనాలు దెబ్బతిన్నాయి.

van
van

By

Published : Jul 11, 2022, 7:19 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పోలీస్​స్టేషన్ పరిధి తుక్కుగూడా వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై డీసీయం వ్యాన్ భీభత్సం సృష్టించింది. తుక్కుగూడ సర్కిల్​ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యూటర్న్ తీసుకుంటుండగా.. అదుపు తప్పిన డీసీఎం వేగంగా వచ్చి ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టి అదే వేగంతో ఓ కారు, మరో డీసీఎంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. నలుగురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.

యూటర్న్ తీసుకుంటున్న సమయంలో బస్సులో ప్రయాణికులు లేరు. లేకుంటే ప్రాణనష్టం జరిగేది. ప్రమాదంలో ఒక కారు, 2 డీసీఎంలు, ఓ ప్రైవేట్ బస్సు ధ్వంసమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తుక్కుగూడలో డీసీఎం వ్యాన్ బీభత్సం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details