Cyber Criminals Robbed: సైబర్ నేరగాళ్ల మాయ.. మహేశ్ బ్యాంకులో రూ. 12 కోట్ల లూటీ - bank robbery

18:48 January 24
మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి రూ.12 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు
Cyber Criminals Robbed: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై దాడి చేశారు. బ్యాంక్ మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రూ. 12 కోట్లు మాయం చేశారు. కాజేసిన సొమ్ము రూ. 12 కోట్లను వెంటనే వేరు వేరు బ్యాంకుల్లోని 100 అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. విషయాన్ని గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:దళిత మహిళపై గ్రామ సచివాలయ ఉద్యోగి దాడి.. పోలీసులకు పరస్పర ఫిర్యాదులు