ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CYBER CRIME: హైదరాబాద్‌ వైద్యుడికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. రూ.11 కోట్లు బదిలీ

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు చిక్కుకున్నారు. ఔషధాల్లో కలిపే ఆయిల్‌ను విక్రయిస్తామంటూ మురళీ మోహన్‌రావు అనే వైద్యుడిని సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారు. అమెరికాలో ఆయిల్‌ వ్యాపారం చేస్తున్నామని నమ్మించి విడతల వారీగా రూ.11 కోట్లను సైబర్‌ నేరగాళ్ల అకౌంట్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత వాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

By

Published : Aug 6, 2021, 8:49 AM IST

cyber-criminals
cyber-criminals

ఆగ్రో సీడ్ ఆయిల్ పేరుతో 11 కోట్ల రూపాయలు మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. ఔషధాల్లో కలిపే ఆయిల్‌ను విక్రయిస్తామంటూ మురళీ మోహన్‌రావు అనే వైద్యుడిని సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారు. హైదరాబాదుకు చెందిన డాక్టర్ మురళీమోహన్ రావుకి గీత నారాయణ్ అనే మహిళతో ఫేస్​బుక్​ ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె అమెరికాలో తాము ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించింది.

అయితే వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని గీత నారాయణ్​తో పాటు శ్రీలక్ష్మీ అనే మరో మహిళ , డాక్టర్ స్టీఫెన్ అనే వారు నమ్మించారు. వీరి వ్యాపారం నమ్మిన బాధితుడు వారు చెప్పిన విధంగా విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో 11 కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు. అనంతరం వారు స్పందించక పోవడంతో.. ఆయిల్ కూడా సప్లయ్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు సైబర్ క్రైమ్ పోలీసులు.

ఇదీ చూడండి: pulichintala dam: ఆనాడే డ్యాం నిర్మాణంపై నిపుణుల అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details