గిఫ్ట్ బాక్స్ పంపుతున్నాం.. మీ కష్టాన్ని నేనేం ఉంచుకోను. మీరు 40 శాతం తీసుకొండి.. మిగిలిన 60 శాతం అవసరార్థులకు పంపించండి అంటూ ఆశ జూపి జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదేవిధంగా ఓ నిరుద్యోగి రూ.11.17 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు(24) కొత్తపేటలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఫేస్‌బుక్‌లో థామస్ మోసెస్ ఫ్రేక్ నుంచి సందేశం వచ్చింది. నాది యూకే, ఇక్కడ చర్చి ఫాదర్‌గా పనిచేస్తున్నానని చెప్పాడు. డబ్బులు, బంగారం, వజ్రాలతో కూడిన గిఫ్ట్ బాక్స్ పంపిస్తానని, అవసరార్థులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశాడు. అంగీకరించిన బాధితుడు చిరునామా, ఇతర వివరాలు ఇచ్చాడు. ప్యాక్ చేసిన బాక్స్, కొరియర్‌కు సంబంధించిన రశీదును థామస్ పంపించాడు.
40 శాతం తీసుకో.. 60 శాతం పంచేయ్.. అంటూ సర్వం దోచేశాడు!
నేను విదేశాల్లో ఉంటాను.. భారత్ అంటే నాకు అభిమానం.. అక్కడ సేవ చేయాలనుంది. కాకపోతే.. నాకంత సమయం లేదు. నా తరఫున మీరు చేస్తారా.. ప్లీజ్ కాదనొద్దు అంటూ సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారు.
సేవ పేరుతో మోసం
దిల్లీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి కాల్స్ వచ్చాయి. కొంత రుసుము చెల్లిస్తే గిఫ్ట్ బాక్స్‌ను మీకు పంపిస్తామని తెలిపారు. నిజమేనని భావించిన బాధితుడు తెలిసిన చోటల్లా అప్పులు చేసి లక్షలాది రూపాలయను కేటుగాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. గిఫ్ట్ బాక్స్ అందకపోవనటంతో మోసపోయినట్లు తెలుసుకొని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి:ఫేస్'బుక్' చేస్తున్నారు... సామాన్యులూ బాధితులే!