Cyber Frauds: అనంతపురం జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు ఖాతాలదారుల నుంచి వేల రూపాయలను కాజేస్తున్నారు. దీంతో ఖాతాదారులకు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సివస్తోంది. జిల్లాలో నాలుగు రోజులుగా వివిధ బ్యాంకుల నుంచి.. వందలాది మంది ఖాతాదారుల సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారు.
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఖాతాదారులు లక్ష్యంగా మోసాలు - సైబర్ మోసాలు
Cyber Frauds: ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో.. అంతకంటే ఎక్కువే దుర్వినియోగమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో.. ఎదుటివారి బలహీనతలను, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అలా అని కాకుండా.. కాదేది సైబర్ మోసాలకు అనర్హం.. అన్నట్టు రెచ్చిపోతున్నారు నేరస్థులు. గత నాలుగు రోజులుగా అనంతపురం జిల్లాలో బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తూ... ఖాతాదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Cyber crime in Anantapur district
సొమ్ము డెబిట్ అయినట్లు మెసేజ్‌లు రావడంతో.. బాధితులు బ్యాంకులు, సైబర్ పోలీసు స్టేషన్‌లకు పరుగులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫిర్యాదు చేయటానికి వెళితే బ్యాంకు మేనేజర్లు, సైబర్ పోలీసులు.. పట్టించుకోవటంలేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:కువైట్ హత్యల కేసు..ఇండియన్ ఎంబసీని ఆశ్రయించిన తెలుగువారు