ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

CYBER CHEATING: ఆయుర్వేద వైద్యురాలిని ట్రాప్​ చేసి రూ.40 లక్షలు కొట్టేశాడు.. - telangana varthalu

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. మోసగాళ్లు సరికొత్త పంథాలో.. ఊహించని రీతిలో.. బురిడీ కొట్టిస్తున్నారు. ఈ సారి ఆయుర్వేద వైద్యురాలి నుంచి రూ. 40లక్షలు కాజేశారు.

cyber-cheaters
cyber-cheaters

By

Published : Jun 30, 2021, 7:25 AM IST

ఈ సారి ఆయుర్వేద వైద్యురాలిని మోసం చేశారు సైబర్​ నేరగాళ్లు. ఆయుర్వేద వైద్యురాలిని ట్రాప్ చేసి ఆమె నుంచి నలభై లక్షలను కాజేశారు. హైదరాబాద్​ మెహిదీపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు శైలాతో ఒక రోగిగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా జేమ్స్ మారియో అనే నైజీరియన్ పరిచయం చేసుకున్నాడు. అమెరికా కంపెనీకి మెడిసిన్ ఫార్ములా విక్రయిస్తే ఐదు కోట్లు ఆఫర్ ఇప్పిస్తానని చెప్పడంతో... అతడి మాటలు నమ్మిన వైద్యురాలు ఉచ్చులో చిక్కుకున్నారు.

డాలర్స్ ఎక్సేంజ్​, ట్రాన్స్​ఫర్​ ఛార్జీలు అంటూ పదే పదే నమ్మించి మూడు విడతలుగా రూ. 41 లక్షలు తన అకౌంట్​కి ట్రాన్స్​ఫర్ చేయించుకుని తర్వాత కేటుగాడు ఫోన్ స్విచ్ఛాప్​ చేశాడు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన వైద్యురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details