ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కట్టింగ్ ఉపకరణంగా రెండున్నర కిలోల బంగారం.. పట్టుకున్న శంషాబాద్ సిబ్బంది

బంగారం అక్రమ రవాణా కొత్తపుంతలు తొక్కుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించేందుకు మోసగాళ్లు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వివిధ రూపాల్లో పుత్తడిని అక్రమంగా తరలిస్తున్నారు. ఇలాగే మిక్సర్ గ్రైండర్, కట్టింగ్ ఉపకరణాల్లో బంగారాన్ని దాచి.. దుబాయ్ నుంచి తీసుకొస్తున్న ప్రయాణికులను కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

customs
customs

By

Published : Mar 31, 2021, 12:15 PM IST

దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికులను హైదరాబాద్‌ రాజీవ్​గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. మిక్సర్‌ గ్రైండర్‌, కట్టింగ్‌ ఉపకరణాల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు.

సుమారు రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విలువ సుమారు రూ.1.15 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేశారు.

వీటితో పాటు ఓ వ్యక్తి దుబాయ్‌కి డాలర్లను తరలిస్తుండగా సీఐఎస్​ఎఫ్​ సహకారంతో గుర్తించి.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఓ ప్రయాణికుడు సుమారు రూ.30 వేల యూఎస్​ డాలర్లను తీసుకుని దుబాయ్‌కి బయలుదేరాడు. తనిఖీల్లో గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు.. డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.21.48 లక్షలకు సమానంగా ఉంటుందని వివరించారు.

ఇదీ చూడండి:వీడియో కాల్స్ కదా అని ఎత్తారో.. ఇక అంతే సంగతులు

ABOUT THE AUTHOR

...view details