ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కరోనా వచ్చిందని చెరువులో దూకి మహిళ ఆత్మహత్య - తెలంగాణలో కరోనా మరణాలు

కొవిడ్​ పాజిటివ్​ వచ్చిందంటే చాలు ప్రాణాలు పోతాయనే భయంతో పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే బతికి బయటపడొచ్చనే అవగాహన లేకపోవడం వల్ల గాబరాపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్​ మండలం సాలురకు చెందిన ఓ కొవిడ్​ బాధితురాలు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది.

కరోనా వచ్చిందని చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
కరోనా వచ్చిందని చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

By

Published : Apr 27, 2021, 2:24 PM IST

కొవిడ్​ పాజిటివ్​ వచ్చిందని ఓ మహిళ (55) ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురకు చెందిన మహిళకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తనకు ఎమవుతుందోనని ఆందోళనతో బలవన్మరణానికి పాల్పడింది.

మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కరోనా బాధితులు మానసికంగా ఆందోళన చెందొద్దని అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చికిత్స ఉందని తెలిసినా విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:'ఈటీవీ బాలభారత్'​ ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు

ABOUT THE AUTHOR

...view details