Couple Suicide: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో అప్పుల బాధ తట్టుకోలేక గోపవరపు వెంకటేశ్వర్లు, అంజనాదేవి దంపతులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు. కొంత కాలంగా వెంకటేశ్వర్లుకి వ్యాపారంలో నష్టం వాటిల్లింది. ఫలితంగా అప్పులు చేశాడు. వ్యాపారంలో వచ్చిన నష్టభారం తగ్గకపోగా.. అప్పుల బాధ ఎక్కువ అయ్యింది. తట్టుకులేక దంపతులిద్దరూ శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అమెరికాలో ఇద్దరు కుమారులు.. అప్పుల బాధ తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య - అమెరికా
Couple Suicide: ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించి అమెరికా పంపిన తల్లిదండ్రులు అప్పుల బాధ తాళ లేక ఆత్మహత్య చేసుకున్నారు. సొంత గ్రామంలో ఉంటూ రైస్ మిల్లు నిర్వహిస్తున్న వారు అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
దంపతుల ఆత్మహాత్య
Last Updated : Oct 8, 2022, 2:21 PM IST