COUPLE SUICIDE AT ALLURI DISTRICT : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్త బళ్లుగూడలో విషాదం జరిగింది. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ గా పనిచేస్తున్న రాధ, ఆమె భర్త సుమన్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలోని ఉపాధ్యాయుల నివాస గృహంలో రాత్రి దంపతులు నిద్రించారు. ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో.. నిర్వాహకులు బలవంతంగా తెరిచారు . భార్యాభర్తలిద్దరూ విగతజీవులై మంచంపై పడి ఉండటాన్ని గమనించి ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దంపతుల ఆత్మహత్య.. అదే కారణమా? - couple suicide news in alluri distrcit
COUPLE SUICIDE IN ALLURI DISTRICT : అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తబళ్లుగూడలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
COUPLE SUICIDE IN ALLURI DISTRICT