ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...సర్పంచ్ కుటుంబం దుర్మరణం - లారీ ఆక్సిడెంట్​

నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ రూపంలో వచ్చిన మృతువు ఓ కుటుంబాన్ని కబళించింది. అతి వేగంతో దూసుకొచ్చి అదుపుతప్పి టాటా ఏస్, ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.

lorry accident at nidamanuru
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Apr 2, 2021, 10:18 PM IST

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమనూరులో లారీ బీభత్సం సృష్టించింది. మిర్యాలగూడ నుంచి దేవరకొండ వైపు అతివేగంతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పడం వల్ల.. ఇద్దరు పిల్లలతో సహా తిప్పలమడుగు సర్పంచ్ దంపతులు మృతి చెందారు.

బియ్యం లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా పుచ్చకాయల లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టి సుమారు 40 అడుగుల దూరం లాక్కెళ్లింది. ఇంతలో బైక్​పై కుటుంబంతో కలిసి ముప్పారం వెళ్తున్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీను బైక్​ను కూడా ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం లారీ కిందకు దూసుకెళ్లడం వల్ల శ్రీను లారీ కింద ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఆయన భార్య విజయ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఇద్దరు పిల్లలు శ్రీ విద్య, కుమారుడు వర్షిత్​ను మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. టాటా ఏస్​ వాహనంలో ఉన్న నిడమనూర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన నాగరాజు, యశ్వంత్, గరిడేపల్లికి చెందిన టాటా ఏస్​ వాహనం డ్రైవర్ దస్తగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంతో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇదీ చూడండి:

ఇప్పటివరకు ముగ్గురు.. అనుమానం ఏడుగురు.. అసలెంతమంది..?

ABOUT THE AUTHOR

...view details