COUPLE DIED IN ROAD ACCIDENT: అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడుతో ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయిబోయిన కారు.. అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ROAD ACCIDENT AT ANANTHAPURAM: అనంతలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ దంపతుల మృతి..! - AP LATEST ROAD ACCIDENT
ANANTHAPURAM ROAD ACCIDENT: అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేయబోయిన ఓ కారు.. అదే లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

అనంతలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ దంపతుల మృతి..!
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. గాయపడ్డ వెంకటేష్, రాజు, సోంలనాయక్, సీతమ్మను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ నుంచి హిందూపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులు తెలంగాణలోని వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామిగా గుర్తించారు.
ఇదీ చూడండి:Business Woman Shilpa Fraud: పార్టీలు ఇచ్చి... సెలబ్రిటీలను ఆకర్షించి కోట్లు వసూలు