హైదరాబాద్‌లో చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో లూటీ చేశారు దంపతులు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.5.5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడ్డారు. చివరకు అందరికీ కుచ్చుటోపి పెట్టారు.
అసలేం జరిగిందంటే...చిట్టీల పేరుతో ఐదున్నర కోట్ల రూపాయలు మోసం చేసిన ఓ దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు వారు ఆందోళన దిగారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ ప్రాంతానికి చెందిన మధు, భార్య దివ్య... ఆరు సంవత్సరాల నుంచి చిట్టి వ్యాపారం చేస్తున్నారు. చిట్టీలు పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు 11 నెలల క్రితం శాలిబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.