TWO CONSTABLES ARRESTED: హోంగార్డ్ ఉద్యోగాలిప్పిస్తామని నగదు వసూలు చేసి అవినీతికి పాల్పడుతున్న కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్టు చేసి.. వారిని కోర్టులో హాజరుపర్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బారెడ్డి.. ఇద్దరు వ్యక్తులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అంతేకాకుండా వారి నుంచి 18 లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ విషయంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారెడ్డికి సురేష్ అనే కానిస్టేబుల్ సహాయం చేసాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు సురేష్‌ను కూడా అరెస్టు చేసి.. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని సమాచారం.
ఉద్యోగాల పేరిట మోసం.. ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ - KRISHNALANKA
CONSTABLES ARRESTED: ఇంటి దొంగాలను ఈశ్వరుడైన పట్టుకోలేరు అంటారు. కానీ, ఇక్కడ పట్టుకున్నారు. కాకపోతే ఇంటి దొంగలు దొంగతనం చేసింది ఇంట్లో కాదు.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూల్లు చేపట్టారు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు కానీస్టేబుళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 లక్షల రూపాయలకే బేరం పెట్టారు. చివరికి ఏం జరిగిందంటే..
లంచం