ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో... అర్చకుల ఘర్షణ - Priests of both sects attack Ranganatha swamy temple

ఆలయంలో పూజలు చేయాల్సిన అర్చకులు.. వర్గాలుగా విడిపోయి అధికారుల ముందే గొడవపడ్డారు. ఆపై దాడులు చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తొండపాడు గ్రామంలోని బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో జరిగింది.

బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో... ఇరువర్గాల అర్చకులు దాడులు
బోలికొండ రంగనాథ స్వామి ఆలయంలో... ఇరువర్గాల అర్చకులు దాడులు

By

Published : Mar 22, 2021, 7:43 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో శ్రీ బోలికొండ రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో ఎండోమెంట్ అధికారులు అర్చకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించిన భూముల పంపకం, వంతుల వారీగా ఆలయంలో పూజల నిర్వహణ తదితర కార్యక్రమాలకు సంబంధించి చర్చ జరిగింది.

ఈ క్రమంలో.. నిర్వహణ విషయంలో ఇరు వర్గాల అర్చకుల మధ్య మాట మాట పెరిగింది. ఆపై దాడుల వరకూ వెళ్లింది. ఆలయాధికారులు ఇరువర్గాలకు సర్ది చెప్పి సమావేశాన్ని రద్దు చేశారు. ఇరువర్గాల అర్చకుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details