ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Clash: తిరునాళ్లలో ఆకతాయిల అల్లరి.. ఇరు వర్గాల ఘర్షణ

By

Published : Apr 19, 2022, 8:01 AM IST

Clash: సహజంగా గ్రామాల్లో ఏదైనా తిరునాళ్లు జరిగితే చిన్న పిల్లల కోలాహలం, యువకులు గోలలు, పెద్దల భక్తి.. అబ్బో చాలా రకాలుగా అక్కడి వాతావరణం ఉంటుంది. ఇక్కడ సైతం అలానే ఉంది.. కాకాపోతే అది కాస్తా శ్రుతిమించింది. ఎందుకంటే ఓ గ్రామంలో జరుగుతున్న తిరునాళ్లలో కొందరు ఆకతాయిలు.. అతి వేగంతో ద్విచక్రవాహనాలను నడుపుతుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. పరస్పరం దాడుల అనంతరం యువకుడి తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

conflict between two groups
బాపట్ల జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Clash: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామంలో జరిగిన తిరునాళ్లలో కొందరు యువకుల తీరు ఘర్షణకు దారితీసింది. ప్రజ్ఞమ్మ గ్రామ దేవత తిరునాళ్లలో కొందరు ఆకతాయిలు.. అతి వేగంగా ద్విచక్రవాహనాలను నడుపుతుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కర్రలు, చెక్కలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధిత యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని చెల్లాచెదురు చేశారు.

ABOUT THE AUTHOR

...view details