ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Video Viral: చెత్త విషయంలో మహిళల మధ్య గొడవ... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ - మహిళల మధ్య గొడవ

Fight about dust: చెత్త వేసే విషయంలో మహిళల మధ్య జరిగిన గొడవ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒకరి ఇంటిముందు మరొకరు చెత్త వేయడంతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది.

Conflict among women over littering
Conflict among women over littering

By

Published : Mar 7, 2022, 6:59 AM IST

చెత్త విషయంలో మహిళల మధ్య గొడవ...

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో చెత్తవేసే విషయంలో మహిళల మధ్య జరిగిన గొడవ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మోరగుడి ఎస్సీ కాలనీలో లక్ష్మీదేవి అనే మహిళపై సుబ్బన్న, అతని భార్య దాడి చేశారు. ఇంటి ఎదురుగా చెత్త వేయవద్దని చెప్పడంతో ఈ ఘర్షణకు దారితీసింది. వీధిలోనే రాళ్లు, కర్రలతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు.

ఈ ఘటన వైరల్‌ కావడంతో.. పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాలను పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారు. బాధితురాలు లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు సుబ్బన్న, సుందరమ్మ దంపతులు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు జమ్మలమడుగు ఎస్ఐ రఘురామ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details