ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

COMPLAINT: సీఎం ఎదుట నిరసన తెలిపిన 'ఏఆర్​ కానిస్టేబుల్'​పై ఫిర్యాదు.. - సీఎం ఎదుట నిరసన తెలిపిన ఏఆర్​ కానిస్టేబుల్​పై ఫిర్యాదు

COMPLAINT: అనంతపురం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని అమరవీరుల స్థూపంవద్ద ప్రభుత్వంపై నిరసన తెలిపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌పై స్పందన కార్యక్రమంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన తన భార్యతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు.

AP POLICE
AP POLICE

By

Published : Jul 12, 2022, 8:24 AM IST

COMPLAINT: ‘సేవ్‌ ఏపీ పోలీస్‌’ అంటూ గత నెల జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని అమరవీరుల స్థూపంవద్ద ప్రభుత్వంపై నిరసన తెలిపిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌పై గార్లదిన్నెకు చెందిన ఓ వ్యక్తి సోమవారం అనంతపురంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల కిందట కుటుంబ కలహాల నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు తన భార్య ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చిందన్నారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఆమెతో పరిచయం పెంచుకుని, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. నాలుగేళ్లుగా వీరిద్దరూ కలిసి తనను చంపి, ఆస్తిని చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నారని వాపోయారు. సీఎం జగన్‌ గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ అదే రోజున ‘ఏపీ సీఎం జగన్‌ సార్‌.. సేవ్‌ ఏపీ పోలీస్‌.. గ్రాంట్‌ ఎస్‌ఎల్‌ఎస్‌, ఏఎస్‌ఎల్‌ఎస్‌ ఎరియర్స్‌’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ కదలికలపై నిఘా ఉంచారు. పది రోజుల కిందట క్రమశిక్షణకు సంబంధించి ఒకేరోజు మూడు సంజాయిషీ నోటీసులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details