ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భార్యను తుపాకీతో బెదిరించిన ఎస్సై.. అందుకోసమేనా? - అన్నమయ్య జిల్లా తాజా వార్తలు

SI: అతనొక పోలీసు అధికారి.. వరకట్నం కోసం ఎవరైనా వేధిస్తే వాళ్లని శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. అతనే ఎక్కువ కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురాకపోతే తుపాకీతో కాల్చుతానని బెదిరించాడు. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..?

SI
భార్యను తుపాకీతో బెదిరించిన ఎస్సై

By

Published : May 25, 2022, 12:49 PM IST

SI: అన్నమయ్య జిల్లా ముదివేడు ఎస్సై సుకుమార్‌పై వరకట్నం కేసు నమోదైంది. అదనపు కట్నం కింద రూ.10లక్షలు తీసుకురావాలని వేధించినట్లు అతడి భార్య మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తీసుకురాకపోతే తుపాకితో కాల్చుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎస్సై సుకుమార్‌తోపాటు అతని కుటుంబసభ్యులపైనా కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లె గ్రామీణ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details