Coast Guard nabs Sri Lankan fishermen: భారత జలాల్లోకి చొరబడి చేపల వేట సాగిస్తున్న శ్రీలంక మత్స్యకారుల్ని కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. రెండు బోట్లను 300 కేజీల చేపల్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపల వేట సాగిస్తున్నట్లు కోస్ట్ గార్డ్స్ గుర్తించారు. 11 మంది శ్రీలంక మత్స్యకారుల్ని కాకినాడ మెరైన్ పోలీసులకు అప్పగించారు. చేపల్ని 32 వేల రూపాయలకు వేలం వేసినట్టు మెరైన్ సీఐ సుమంత్ తెలిపారు.
ఇవీ చదవండి