తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరుకు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana). పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు(maoist killed in telangana).
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి - TS LATEST NEWS
09:59 October 25
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
ఘటనా స్థలం నుంచి 3 మృతదేహలతో పాటు ఎస్ఎల్ఆర్, ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తప్పించుకున్న వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో ఏజెన్సీలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
మృతిచెందిన మావోయిస్టుల వివరాలు
ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు ఐత అలియాస్ ఐతడు, ముర్చకి ఉంగల్ అలియాస్ రఘుగా పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఐత ఈ ఘటనలో మృతిచెందినట్లు తెలిపారు. రఘు బీజాపూర్ జిల్లా బైరంగడు మండలం కుర్రవాడ గుంపు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
ఇదీ చదవండి:Actor died: టాలీవుడ్ నటుడు రాజబాబు మృతి