attack: మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి - confrontation between two young mens at gudiwada railway station
07:41 September 17
మద్యం మత్తులో ఇద్దరు యువకులు మధ్య ఘర్షణ
కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందాడు. పట్టణానికి చెందిన రాపానీ ఏసు, బత్తుల సాయికుమార్ అనే ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలతో మొదలైన గొడవ.. ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. సాయి కుమార్‌పై గొడ్డలితో ఏసు దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్‌ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వైద్యులు విజయవాడకు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీచదవండి..
RAPE ATTEMPT: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్టు