ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఇరువర్గాల ఘర్షణకు దారి తీసిన ఇద్దరి మధ్య గొడవ.. ఒకరికి గాయాలు - వాల్ట్​​ బ్రేవరీ బార్

VAULT BREWERY BAR IN VIJAYAWADA : ఓ బార్​లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ.. రెండు వర్గాల ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ వివాదం విజయవాడలోని ఓ బార్​లో జరిగింది.

VAULT BREWERY BAR IN VIJAYAWAD
VAULT BREWERY BAR IN VIJAYAWAD

By

Published : Oct 30, 2022, 8:19 PM IST

CLASHES BETWEEN TWO TEAMS BAR AT VIJAYAWADA : విజయవాడ వాల్ట్​​ బ్రేవరీ బార్​​లో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం చివరకు ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది.వంశీ అనే యువకుడితో పాటు హర్షవర్థన్​, అతని స్నేహితులు బార్​కు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న యువకులు.. ఒకరినొకరు దూషించుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో నవీన్ అనే యువకుడిపై హర్షవర్థన్, అతని స్నేహితులు దాడి చేశారు. దాడిలో గాయపడిన నవీన్​ని నగరంలోని లిబర్టీ హాస్పిటల్​కి తరలించి వైద్య చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల నగరంలో గ్యాంగ్ వార్ , ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో యువకుల మధ్య ఘర్షణ, దాడి చేసుకోవడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు యువకులు మధ్య ఘర్షణకు గల కారణాలు, వీరందరూ ఎక్కడివారనే కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details