Clashes Between Two Groups In Same Party : పల్నాడు జిల్లా గురజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వైకాపా నాయకులపై అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు దాడి చేశారు. దీంతో ఆ వర్గంలోని ఓ వ్యక్తికి తలకు గాయాలయ్యాయి. గాయపడిన రమణ అనే కార్యకర్తని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో రమణకు చెందిన వర్గం నాయకులు.. మరో వర్గానికి చెందిన వారి ఇంటి ముందు ధర్నా చేశారు. ఆ సమయంలో మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ లోపలే ఇంత జరిగిన పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించినట్లు సమాచారం.
గురజాల పోలీస్స్టేషన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి తలకు గాయం - పోలీస్స్టేషన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
Clashes Between Two Groups : గురజాల పోలీస్ స్టేషన్లో రాత్రి 11 గంటల సమయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వైకాపా నాయకులపై.. అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తి తలకు గాయమైంది.
clashes between two communities in same party