స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి.. - పిడుగురాళ్ల కనకదుర్గమ్మ గుడి వద్ద స్నేహితుల మధ్య ఘర్షణ
08:05 September 05
నాగేంద్రకు తీవ్రగాయాలు, ప్రైవేటు వైద్యశాలకు తరలింపు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భవానీ నగర్లో శనివారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. సూరగాని ఆంజనేయులు.. తండ్రి శ్రీనివాస రావుతో కలిసి కటింగ్ చేయించుకునేందుకు హెయిర్ కటింగ్ షాపుకు వచ్చాడు. అక్కడే ఉన్న స్నేహితుడి తండ్రి చల్లా శ్రీనివాసరావు... హెయిర్ కటింగ్ మంచిగా చేయించుకోవాలని ఆంజనేయులికి సూచించాడు. నవ్వేంటి నాకు చెప్పేదని.. కోపంతో ఊగిపోయిన ఆంజనేయులు చల్లా శ్రీనివాసరావు చెంపపై కొట్టాడు.
అక్కడే ఉన్న శ్రీనివాస రావు కొడుకు నాగేంద్రబాబు.. మా నాన్ననే కొడతావా అంటూ స్నేహితుడితో గొడవకు దిగాడు. నువ్వేంట్రా నాకు చెప్పేదంటూ ఆంజనేయులు ఎదురు దాడికి దిగాడు. కోపం ఎక్కువై పక్కనే ఉన్న కత్తెర తీసుకొని నాగేంద్ర బాబు మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నాగేంద్రబాబును వెంటనే పిడుగురాళ్ల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చల్లా శ్రీనివాస్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ycp attack: ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయుల దాడి