ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టు - Telangana Civil Liberties Committee Vice President Raghunath

హైదరాబాద్​లో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టయ్యారు. బుధవారం ఉదయం నుంచి పీఎన్టీ కాలనీలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్​ఐఏ) రఘునాథ్​ను అరెస్ట్​ చేసింది.

Civil Liberties Committee
పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టు

By

Published : Apr 1, 2021, 1:19 AM IST

హైదరాబాద్​లో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టయ్యారు. పీఎన్టీ కాలనీలోని ఆయన ఇంట్లో రఘునాథ్​ను ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని విరసం, పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సరూర్‌నగర్ పరిధి పీఎన్టీ కాలనీలోని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ ఇంట్లో సోదాలు చేసింది. రఘునాథ్ కంప్యూటర్, ల్యాప్‌టాప్​ను అధికారులు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details