హైదరాబాద్ ఉప్పల్‌లోని గాస్పర్ చర్చిలో జోసఫ్ పాస్టర్‌గా పనిచేస్తూ... ఓ టీవీ ఛానల్లో మత ప్రభోధకుడిగా వ్యవహరిస్తున్నాడు. మంచి మాటలతో ప్రజలకు హితబోధ చేసే జోసఫ్‌లో మరో కోణం ఉంది. అదే యువతులను మభ్య పెట్టడం. చర్చికి వచ్చే యువతులే అతనికి టార్గెట్. వారికి మాయ మాటలు చెప్పి... మంచిగా ఉన్నట్లు నటిస్తూ వారిని లొంగదీసుకునేవాడు. అలా జోసఫ్ ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడపి... మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
PASTOR ARREST: పేరుకే పాస్టర్...అతని చూపంతా.. - పాస్టర్ అరెస్ట్
పేరుకు చర్చిలో పాస్టర్... కానీ అతని చూపంతా యువతులపైనే... వారిని మభ్యపెట్టి.. లోబరుచుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకునే రకం. ఈ విషయం తెలియని అమ్మాయిలు.. ఆ పాస్టర్ ట్రాప్‌లో చిక్కుకున్నారు. ప్రేమ అనే మాయలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. ఎట్టకేలకు వాస్తవాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగింది.
ఎలా తెలిసిందంటే..
ఈ మధ్య కాలంలో జోసెఫ్ యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతూ... బెదిరింపులకు పాల్పడ్డాడని యువతులు ఆరోపించారు. ఈ క్రమంలోనే అతనికి మూడు పెళ్లిళ్లు జరిగినట్లు యువతులకు తెలిసింది. ఆగ్రహానికి లోనైన బాధితులు జోసెఫ్‌ను నిలదీశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్‌ను అరెస్టు చేసి.. రిమాండ్‌కు పంపినట్లు సీఐ అంజిరెడ్డి తెలిపారు. ఆ ముగ్గురిని ప్రేమలో దించి... అదే చర్చిలో పెళ్లి చేసుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: