ARREST: ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతూ.. అకౌంటులో డబ్బులు కాజేసిన రాజస్థాన్‌కు చెందిన జీవన్‌కుమార్ అనే వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లాలోని చిల్లకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1,80,000 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ మోసం.. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ARREST: అతని వృత్తి ఆన్లైన్లో మోసాలకు పాల్పడటం.. అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి.. అమాయకులకు గాలం వేస్తాడు. అతడిని నమ్మినవారికి పంగనామాలు పెడతాడు. తనకు డబ్బులు వచ్చే వరకు వారిని మాటలతో మాయజేస్తాడు.. అతని పని అయిపోయాక నెంబర్ని బ్లాక్ చేస్తాడు. తాజాగా అతని మాయమాటలు నమ్మి రెండు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు చిల్లకల్లుకు చెందిన వ్యక్తి. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు.
ఏసీపీ కథనం ప్రకారం.. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పని చేస్తున్న సంజయ్‌కు గత సంవత్సరం డిసెంబర్ 4న ఫోన్ వచ్చింది. అందమైన అమ్మాయిల ఫొటోలు పంపాలంటే.. కొంత మొత్తం అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పాడు. ఫోన్‌పే చేయమని చెప్పగా.. తనకు ఫోన్‌పే లేదని చెప్పాడు. దీంతో కార్డు నెంబరు చెప్పమని కోరాడు.. అతడిని నమ్మిన సంజయ్.. కార్డు నెంబరు చెప్పగా.. కార్డు హ్యాక్‌చేసి ఓటీపీ ద్వారా మూడు దఫాలుగా 2లక్షల 45వేల రూపాయలు డ్రా చేశాడు. తన అకౌంట్ నుంచి డబ్బులు పోవడంతో.. మోసపోయానని తెలుసుకున్న సంజయ్.. చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జగ్గయ్యపేట సీఐ, చిల్లకల్లు ఎస్సై చిన్నబాబు, వారి టీమ్ చాకచక్యంగా ముద్దాయిని రాజస్థాన్‌కు వెళ్లి అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: