ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Accident CCTV Footage: చిన్నారిని చిదిమేసిన డ్రైవర్ నిర్లక్ష్యం - child fell under accidentally under car in nacaharam

Accident CCTV Footage: ఓ కారు డ్రైవర్​ నిర్లక్ష్యం.. అభంశుభం తెలియని చిన్నారిని చిదిమేసింది. కారు కిందపడి పాప దుర్మరణం చెందిన ఘటన హైదరాబాద్​లోని నాచారం పరిధిలో జరిగింది.

Accident CCTV Footage
డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు కింద పడి చిన్నారి దుర్మరణం

By

Published : May 9, 2022, 10:21 PM IST

డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు కింద పడి చిన్నారి దుర్మరణం

హైదరాబాద్ నాచారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు కిందపడి చిన్నారి దుర్మరణం చెందింది. నాచారంలోని ఓ కాలనీలో ఆగి ఉన్న కారు వెనకాల ఉన్న చిన్నారిని గుర్తించని డ్రైవర్.. నిర్లక్ష్యంగా వాహనాన్ని వెనక్కి తీశాడు. దీంతో చిన్నారి కారు టైరు కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. పాప కేకలతో బండి ఆపి దిగి చూసేసరికి వాహనం చక్రాల కింద రక్తపు మడుగులో ఉన్న చిన్నారి అప్పటికే చనిపోయింది. స్థానికుల సమాచారంతో సమాచారం అందుకున్న నాచారం పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details