solar gold coat app fraud : 'సోలార్ గోల్డ్ కోట్' యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టారు. పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందటూ వాట్సాప్‌ల్లో ప్రచారం చేశారు. 400 పెట్టుబడి పెడితే... ఆ మెత్తాన్ని రోజుకూ 14 రూపాయల చొప్పున 45 రోజుల్లో తిరిగి చెల్లిస్తామన్నారు. అలా వెయ్యి, 3వేలు, 13వేలు, 35వేలు, 75వేలు, లక్ష చెల్లిస్తే గరిష్ఠంగా... ఆర్నెళ్లలో 8లక్షల52వేల వరకూ చెల్లిస్తామని నమ్మబలికారు. రుజువుగా అప్పటి వరకు ఆదాయాన్ని పొందినవాళ్లను వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు.
solar gold coat app cheating : సంప్రదింపులన్నీ వాట్సాప్ వేదికగా సాగితే.. లావాదేవీలన్నీ యాప్ ద్వారా జరిగాయి. పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోగా.... నాలుగైదు రోజుల కిందట యాప్ మాయమైంది. వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులు కనిపించకుండా పోయారు. డబ్బులు రావడం ఆగిపోయింది. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.
"సోలార్ గోల్డ్ కోట్ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే రోజు రూ.1500 నుంచి రూ.4000 వరకు వస్తుందని చెప్పారు. అందుకే మేం అందులో పైసలు పెట్టాం. నేను రూ.35000 వేస్తే.. నాకు రూ.8 లక్షలు వస్తుందని చెప్పారు. కానీ నాకు రూ.4000 మాత్రమే వచ్చింది. తర్వాత కాల్ చేస్తే ఎవరూ స్పందించలేదు. మెసేజ్‌లకు రెస్పాండ్ కాలేదు. ప్లే స్టోర్‌లో యాపే మాయమైపోయింది." - బాధితులు