ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ, పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు - villagers attack on thief

Chain snatching పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ఓ దొంగ కన్నేశాడు. ఆమెతో మాటలు కలిపి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. సినిమా స్టైల్​లో చేజింగ్​ జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి

attack on thief
attack on thief

By

Published : Aug 18, 2022, 5:29 PM IST

Updated : Aug 18, 2022, 6:56 PM IST

Thief caught by people: పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఓ దొంగను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. జిల్లాలోని కదిరి మండలం మల్లయ్య గారిపల్లి గ్రామంలోని ఓ పొలంలో ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మమ్మ అనే వృద్ధురాలు మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరిగెత్తాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో వెనుక వైపు నుంచి వస్తున్న కారు వేగంగా వెళ్లి అతడిని అడ్డుకుని.. దొంగను పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆ ఊరి గ్రామస్థులు దొంగను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. బంగారు గొలుసు లాక్కెళ్లి న వ్యక్తి కదిరి పట్టణానికి చెందిన శివ కుమార్​గా గుర్తించిన స్థానికులు.. అక్కడి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపహరణకు గురైన గొలుసుతో పాటు దొంగను పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాట్లు వెల్లడించారు.

వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ, పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
Last Updated : Aug 18, 2022, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details