సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన సెల్ఫోన్ల దొంగతనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ. 15 లక్షల విలువైన చరవాణీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
మొబైల్ స్టోర్‌లో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - cell phones robbery in samsung mobile store
సమయం అర్ధరాత్రి దాటింది. రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. అవేమీ పట్టించుకోలేదు.. ఆ ఏడుగురు. ఐదుగురు దొంగతనం పనిలో ఉంటే.. మిగతా ఇద్దరు బయట కాపలాగా నిలిచారు. బెడ్ షీట్లను పరదాలుగా పెట్టి మొబైల్ దుకాణంలోకి ప్రవేశించారు. దొరికినకాడికి సెల్ఫోన్లను దోచుకున్నారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
శుక్రవారం రాత్రి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్టోర్ తాళం తొలగించి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పక్కా ప్రణాళికతో లోపలికి ప్రవేశించిన దుండగులు పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.15 లక్షల విలువైన చరవాణీలు చోరీకీ గురయ్యాయని చెప్పారు. ఈ ఉదయాన్నే మొబైల్ స్టోర్‌కి వెళ్లిన యజమాని.. దొంగతనం జరిగిందన్న విషయాన్ని గమనించారు. వెంటనే కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: